- కాంగ్రెస్ పార్టీలోనే..యువతకు పెద్దపీట
- మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల
కరీంనగర్, జనత న్యూస్: యువతకు ముందు నుంచి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రస్తుతం యువ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రకటించిన మేనిఫెస్టోలోను డిగ్రీ పాసై ఖాళీగా ఉన్న యువతకు ఏడాదికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించడం పట్ల హర్షాతీతాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. వెలిచాల వీరాభిమాని సంకినేని రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సమక్షంలో నగరంలోని వివిధ డివిజన్లో కు చెందిన సుమారు 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ రాజేందర్ రావు నువ్వా కప్పి సాదరంగా కాంగ్రస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ యువతకు అత్యంత ప్రాధాన్య తెలుస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ప్రకటించిన కాంగ్రెస్, ఊతకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. దాంతోపాటు క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహకాలిస్తూ, వారికి అవసరమైన ప్లేగ్రౌండ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. యువతను పెడదోవ పట్టిస్తున్న బిజెపిని బండకేసి కొట్టాలని, హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శ్రీరాముల సందీప్, కె.అరవింద్, ఎన్.రాజు, జి.నిఖిల్, జె.జితేందర్ తదితరులు ఉన్నారు.