Minister Ponnam Prabhakar : రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ని చూసి చలించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం చూపారు. ఆయనతో పాటు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీ వెలిచాల రాజేందర్ రావు, ఆదివారం ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అలుగునూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కనిపించాడు. ఈయనను చూసిన మంత్రి పొన్నం ప్రభాకర్, వెలిచాల రాజేందర్ రావు తమ కాన్వాయ్ ను ఆపి వెంటనే వారి వాహనంలో తమ వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకి ఆదేశాలు ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Minister Ponnam Prabhakar :మంత్రి పొన్నం ఔదార్యం.. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి..
- Advertisment -