ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై సీఐడీ ఎప్ఐఆర్ నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార వైసిపి పార్టీ ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీరిపై కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబును ఏ1, లోకేష్ ను ఏ2 గా చేర్చింది. ఎన్నికల సమయం ముగిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతుంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచేందుకు ప్లాన్ చేస్తున్నానని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చంద్రబాబు, లోకేష్ లపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
- Advertisment -