Trisha : టాలీవుడ్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ త్రిష గురించి తెలియని వారు ఉండరు. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇటీవల 41వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా త్రిషకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ ఇంటర్వ్యూలో త్రిష తమిళ హీరో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ షూటింగ్ సమయంలో అందరూ సరదాగా గడుపుతుంటే విజయ మాత్రం పక్కకు వెళ్ళిపోయి గంటల తరబడి గోడ వైపు చూస్తూ ఉంటారు అని అన్నారు. విజయ్ చాలా సైలెంట్ గా ఉంటాడని చెప్పారు. విజయలో నాకు నచ్చని విషయం అదే అని త్రిష చెప్పకు వచ్చింది.
Trisha : తమిళ హీరో విజయ్ పై సీనియర్ నటి త్రిష హాట్ కామెంట్స్
- Advertisment -