విజయవాడ, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు డిఎస్పీ లపై ఎన్నికల సంఘం వేటి వేసింది. అనంతపురం డీఎస్పి వీర రాఘవరెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబా బాషాను ఈసీ బదిలీ చేసింది. అనంతపురం డిఎస్పి రాఘవరెడ్డి పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బదిలీ చేసింది. వెంటనే తమ కింది అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి పై తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. డిఎస్పి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అనంతపురం టీవీ టవర్ సమీపంలో వ్యక్తిగత కారణాలతో టిడిపి, వైఎస్ఆర్ సీపీ నేతలు గొడవలకు దిగితే ఉద్దేశపూర్వకంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో బదిలీ వేటు వేసింది.
ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు
- Advertisment -