Thirumala Thirupathi: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉంటున్నారు. శుక్రవారం స్వామివారిని62,624 మంది భక్తులు దర్శించుకున్నారు. గత నెలలో శ్రీవారి ఆలయ హుండీ రూ.100 కోట్ల మార్క్ దాటింది. ఇది మార్చితో పోలిస్తే తక్కువే. ఏప్రిల్ నెలలో పరీక్షల కారణంగా ఆదాయం తగ్గింది. ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.
Thirumala Thirupathi: తిరుమలలో భక్తుల రద్దీ
- Advertisment -