Wednesday, September 10, 2025

రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులు చీపుర్లతో కొట్టండి : బండి సంజయ్

  • ఆరు గ్యారెంటీ లపై కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది
  • కెసిఆర్ ఎన్నికలప్పుడే బయటకు వస్తారు
  • బి జె పి అభ్యర్థి బండి సంజయ్

హుజురాబాద్, జనత న్యూస్: రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులు, చీపురుల తో తరిమి  కొట్టాలని బిజెపి అభ్యర్థి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలోని బృందావన్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి బండి సంజయ్ రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోకు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మత రిజర్వేషన్లు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తద్వారా బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. మతపరమైన రిజర్వేషన్ల ద్వారా హైదరాబాద్ లో బీసీలకు వచ్చే స్థానాల్లో ఎంఐఎం లబ్ధి పొందిందని అన్నారు. ప్రధాని మోడీ ఉన్నంతకాలం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ దేశంలో సామాన్య జనంలో భయానక పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తోందని బండి విమర్శించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల హక్కులను రక్షించే పార్టీని తమదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏఐసీసీ ప్రతినిధులు ఎవరు రిజర్వేషన్ల రద్దు పై మాట్లాడలేదని కానీ రేవంత్ రెడ్డి మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి 400 సీట్లు గెలవబోతోందని, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మాణం, త్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రక చట్టాలను నరేంద్ర మోడీ అమలు చేశారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బిజెపి 470 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 310 స్థానాల్లోనే పోటీ చేస్తోందని అన్నారు. బిజెపి గెలిస్తే ప్రధానిగా మోడీ అవుతారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రధాని ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రైతు భరోసా, రైతు కూలీలకు ఐదు లక్షలు, రుణమాఫీ, విద్యార్థినిలకు స్కూటీలు, ధాన్యంపై బోనస్ తదితర హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

తాము బరాబర్ రాముని పేరు చెప్తామని, తాము హిందూ ధర్మ రక్షకులమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయోధ్యలో సరయు నదిలో నాడు వందలాదిమంది కార్యకర్తలు కరసేవకులు మృతి చెందారని గుర్తు చేశారు. అయోధ్యలో జరిగిన బాల రాముని ప్రతిష్టకు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయని అన్నారు. అయోధ్య అక్షింతలను పులిహోరను అవమానించే విధంగా కెసిఆర్ మాట్లాడాలని విమర్శించారు. గుళ్ళపై దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్టు వేస్తున్నారని, కానీ ఎన్నికల హామీల విషయంలో కొట్టును తీసి గట్టినపెట్టారని ఎద్దేవా చేశారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page