కరీంనగర్, జనతాన్యూస్: కాంగ్రెస్ పార్టీలోకి కార్పొరేటర్లు క్యూ కట్టారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్లు, మరికొందరు ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సిరిసిల్లలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఆలస్యంగా జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి వివరాలు:
ఆకుల నర్మద, 11వ డివిజన్ కార్పొరేటర్, గంటా కల్యాణి శ్రీనివాస్, 22వ డివిజన్ కార్పొరేటర్, చాడగొండ బుచ్చిరెడ్డి, 35వ డివిజన్ కార్పొరేటర్, కోటగిరి భూమా గౌడ్, 40వ డివిజన్ కార్పొరేటర్, సరిల్ల ప్రసాద్, 43వ డివిజన్ కార్పొరేటర్, మెండి శ్రీలతా చంద్రశేఖర్, 44వ డివిజన్ కార్పొరేటర్, పిట్ల వినోదా శ్రీనివాస్, 45వ డివిజన్ కార్పొరేటర్, నేతికుంట యాదయ్య, 30వ డివిజన్ కార్పొరేటర్, కేశెట్టి శ్రీనివాస్, 2వ డివిజన్ కార్పొరేటర్, కొల్ల భాగ్యలక్ష్మి ప్రశాంత్, 17వ డివిజన్ కార్పొరేటర్, ఆకుల ప్రకాష్, మాజీ కార్పొరేటర్, పట్టెం పద్మా మోహన్, అర్బన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, డైరెక్టర్లు: కర్రా రాజశేఖర్, వీరారెడ్డి, బొమ్మరాతి సాయికృష్ణ, అనిరాస్ కుమార్, ఈ చేరికల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.