- ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపణ
- తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నికృష్టుడు బండి అంటూ అగ్రహం
కరీంనగర్,జనత న్యూస్: ఐదేళ్లలో ఎంపీగా బండి సంజయ్ ఏమీ చేయలేదని.. రాజకీయంగా ఎదగడానికే సమయానుకూలంగా మోడీని పోగుడుతూ అధిష్టానంలో తన స్థానం భద్రపర్చుకోవడమే విధానంగా అనునిత్యం అబద్దాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని..బండి పెద్ద అబద్దాల కోరని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు.శుక్రవారం నగరంలోని టవర్ సర్కీల్ వద్ద ఏర్పాటుచేసిన ఎన్నికల కార్నర్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రాజేందర్ రావు మాట్లాడారు.ఈ భూమి మీద మనకు జీవనం సాగించే వరాన్ని ఇచ్చిన తల్లిపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరికి తెలిసిన విషయమేనని..తల్లి ఏవరికైనా తల్లియేనని తన రాజకీయం కోసం మాతృమూర్తిపై వాఖ్యలు చేసిన నికృష్టుడు,ఐదేళ్లలో ప్రజల కోసం కనీస అభివృద్ధి పనులు చేయలేని దౌర్భాగ్యుడు బండి సంజయని అగ్రహం వ్యక్తం చేశారు.దివంగత వెలిచాల జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి,ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ఎంత సేవ చేశాడో మీ అందరికీ తెలుసునని..జీవితంలో ప్రజా సంక్షేమమే ప్రధాన కర్తవ్యమనే అయన ఆశయాన్ని కొనసాగించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని మీరందరూ మీ కుటుంబ సభ్యుడివలే ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.