హుజురాబాద్, జనత న్యూస్: హుజురాబాద్ జమ్మికుంట పట్టణ శివార్లలో గత కొద్ది కాలంగా జరుగుతున్న భూ ఆక్రమణలు అక్రమ భూ దందాలు, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పై సీనియర్ కాంగ్రెస్ నేత జమ్మికుంట వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి సీఎం ఏ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంటకు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో తుమ్మేటి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్రమ రియల్ ఎస్టేట్ దందాపై సమగ్రంగా వినతి పత్రం సమర్పించారు. హుజురాబాద్ పట్టణంలో కరీంనగర్ వరంగల్ రహదారి పక్కన దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కొందరు ప్రముఖులు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బోర్నపల్లి రంగాపూర్ వద్ద అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారని, ఇందులో మున్సిపాలిటీకి రావాల్సిన భూమి ఇవ్వలేదని, వెంచర్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. అక్రమ రియల్ వ్యాపారానికి సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తున్నారని ఈ విషయమై సమగ్ర విచారణ చేసి ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అక్రమ రియల్ వ్యాపారంపై భూ ఆక్రమణలపై అసైన్డ్ భూముల కొనుగోలు పై తుమ్మేటి సమ్మిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సీఎం కు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సిందే.
హుజురాబాద్ లో అక్రమ రియల్ దందాపై సీఎంకు ఫిర్యాదు
- Advertisment -