చిగురుమామిడి జనతా న్యూస్: మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో సోమవారం దుర్గమ్మ తల్లి బోనాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డబ్బు వాయిద్యాల మధ్య ఊరేగించారు. దుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ తల్లి నిర్వాహకులు ఎంపీటీసీ పేసరి జమున రాజేశం, మాజీ సర్పంచ్ ముప్పిడి వెంకట నరసింహారెడ్డి , మాజీ ఉప సర్పంచ్ పైడిపల్లి నరేష్ గౌడ్, సాంబార్ కొమురయ్య , తేలు కుంట ఆంజనేయులు, బరిగల సదానందం, చిరంజీవి, వెంకన్న, కయ్యం శ్రీనివాస్, అనగోనీ శ్రీకాంత్, సాంబారి బాబు, బుర్ర తిరుపతి, కయ్యం సారంగం, ముప్పిడి రాజిరెడ్డి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.