- మానకొండూరు ‘దళిత సమ్మేళనం’లో బండి సంజయ్
- బ్రిటీషోడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్
- బీజేపీ అంటే భారతీయ ఆత్మ
- కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు..రాష్ట్రానికి పట్టిన శని
- అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది చెప్పండి
కరీంనగర్,జనత న్యూస్: ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.శుక్రవారం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానకొండూరులో నిర్వహించిన దళిత సమ్మేళనానికి బండి సంజయ్ తోపాటు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రీటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు.
బ్రీటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నారని…. పేరులోనే భారతీయ ఆత్మను సంతరించుకున్న పార్టీ బీజేపీ పార్టీ అన్నారు.తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఓట్లు దండుకుని చివరకు అభివృద్ధి పేరుతో దళితుల భూమినే గుంజుకున్న చోర్ కేసీఆర్ అన్నారు.అహంకారంతో అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదన ఆనాడు దళిత సంఘాలు కేసీఆర్ ను నిలదీయకపోవడం బాధాకరం.కేసీఆర్ తెలంగాణ ఆత్మకాదు రాష్ట్రానికి పట్టిన శనని అసహనం వ్యక్తం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను అవమానించిన బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని బండి సంజయ్ కోరారు.దళితుల సంక్షేమమే పనిచేసే బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీసహా అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం తపించే నేత బండి సంజయ్. కిందిస్థాయి నుండి ఉన్నతస్థాయికి ఎదిగిన బండి సంజయ్ అట్టడుగువర్గాలకు అండగా కొనసాగుతూనే ఉన్నారు. దళితులను ఇసుక లారీలపై తొక్కించి చంపాలని చూస్తే ఎదురించి పోరాడిన నాయకుడు బండి సంజయ్ అని..మోదీ హయాంలో ఎస్సీలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నయన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను తగ్గించే ప్రసక్తే లేదని..మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతామన్నారు.. కమలం పువ్వుపై ఓటేసి మోదీని బలపర్చి బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.