- హుస్నాబాద్,మానకొండూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
- ఒక్క సారీ ఆశీర్వదించి అవకాశమివ్వాలని అభ్యర్థన
కరీంనగర్,జనత న్యూస్: రాష్ట్రంలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లు పరిపాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టినట్టు..అబద్దాలతో మోసం చేస్తూ కేంద్రంలో పదేళ్లుగా పరిపాలన సాగిస్తున్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో బొందపెట్టాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం హుస్నాబాద్,మానకొండూర్ నియోజకవర్గాల్లోని కోహెడ,చిగురుమామిడి,సైదాపూర్,బెజ్జంకి,ఇల్లంతకుంట,గన్నేరువరం మండలాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్,అయా మండలాల నాయకులతో కలిసి వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దుచేసి దేశంలో ఉన్న దళితులను చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని భూస్థాపితం చేయాలన్నారు.పదేళ్లపాటు దేశాన్ని దోచుకున్న బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే సర్వనాశనం చేస్తుందని..రాష్ట్రంలో ఇచ్చినట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు.మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఎంపీగా అవకాశం కల్పించాలని ప్రజలను అభ్యర్థించారు.