కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ లోకసభ స్థానానికి 13 మంది సోమవారం నామినేషన్లను దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.వెలిచాల రాజేందర్ రావు(కాంగ్రెస్),చింత అనిల్ కుమార్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా),తాళ్లపల్లి అరుణ (ఆధార్ పార్టీ),గట్టు రాణా ప్రతాప్ (సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా),చిలువేరు శ్రీకాంత్, (ధర్మ సమాజ్ పార్టీ),లింగంపల్లి శ్రీనివాసరెడ్డి(ఎం సీపీఐ)దేవునూరి శ్రీనివాస్, బంక రాజు, అబ్బడి బుచ్చిరెడ్డి,గవ్వల లక్ష్మి, జింక శ్రీనివాస్,బరిగె గట్టయ్య యాదవ్,ఎండీ జిషాన్ (ఇండిపెండెంట్) అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టు పమేలా సత్పతి తెలిపారు.
పెద్దపల్లిలో 14 నామినేషన్లు..
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి సోమవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం9 ఒక ప్రకటనలో తెలిపారు.దాగం సుధా రాణి(ధర్మ సమాజ్ పార్టీ),దుర్గం సమ్మయ్య,అక్కపాక తిరుపతి (రెండవ సెట్),ఆర్నకొండ రాజు,గడ్డం మారుతి,రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్,అంబాల మహేందర్,జనగామ నరేష్, ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్,జాడి ప్రేమ్ సాగర్ (రెండవ సెట్),మంద రమేష్,గద్దల వినయ్ కుమార్,బొట్ల చంద్రయ్య స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని,నాలుగు రోజుల వరకు 25 మంది అభ్యర్థులు 31 సెట్ల నామినేషన్ లు దాఖలు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.