TDP: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు వారికి బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలిపారు.
TDP: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
- Advertisment -