విజయవాడ, జనత న్యూస్: దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభమైంది. అయితే నామినేషన్లు మొదలైన తొలిరోజే ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జడ్పిటిసి సభ్యురాలు ఆమె అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆమె భర్త వైసిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం దృష్టికి కూడా వెళ్ళింది.దీంతో వైసిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిగా వాణిని నియమించారు. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రీయాశీలకంగా పనిచేశారు. కానీ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వాణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలపడంతో వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
భర్తపై భార్య పోటీ.. ఏపీలో ఆసక్తికర పరిణామాం
- Advertisment -