Saturday, March 14, 2026

Civils Topper : వీరు నేటి యువకులకు ఆదర్శం..

కరీంనగర్, జనత న్యూస్: సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు టాప్ ర్యాంకులు తెచ్చుకొని యువలకు ఆదర్శంగా నిలిాచరు.  మంగళవారం విడుదలైన ఫలితాల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించాడు. అయితే సాయి కిరణ్ ఈ ర్యాంకు సాధించడం సునాయసం కాలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. చేనేత కార్మికుడి కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ కు చిన్నప్పుడే తండ్రి మరణించారు. తల్లి లక్ష్మీ బీడీలు చుడుతూ కూతురు స్రవంతితో పాటు కుమారుడు సాయికిరణ్ ను చదివించింది. కూతురు ఏఈఈగా ఉద్యోగం చేస్తుంది. కుమారుడు 27వ ర్యాంకు సాధించడంతో పేదింటి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో సాయికిరణ్ నేటి యువకులకు ఆదర్శంగా నిలిచాడు.

అలాగే కరీంనగర్ విద్యానగర్ ప్రాంతానికి చెందిన సహప 739వ ర్యాంకు సాధించింది. విద్యానగర్ లోని కొలనుపాక గీత, జయశంకర్ ప్రసాద్ దంపతుల కూతురు అయిన సహన కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాలలో చదివారు. ఆ తరువాత జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్ లో ఉద్యోగం వచ్చినప్పటికీ సివిల్స్ పై మక్కువతో ప్రిపరేషన్ మొదలు పెట్టారు. దీంతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకొన్నారు. అయితే మూడు సార్లు సివిల్స్ రాలేదు. నాలుగో ప్రయత్నంలో 739వ ర్యాంకు సాధించారు. దీంతో వారి కుటుంబంలో సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్స్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు టాప్ లెవల్లో ర్యాంకు తెచ్చుకోవడంపై వీరిని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page