- 2023-24 ఏడాదిలో అగ్ని ప్రమాదాలు సుమారు 322
- వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ
- ముందు జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ
- కరీంనగర్ ఎంత వరకు భద్రం?
- నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
దేశంలోని వనరులు ఆ దేశాభివృద్దికి సూచికలు.ఏదైన విపత్తు సంభవిస్తే అ దేశ సంపదకు నష్టం చేకూరుస్తుంది.ఈ తరుణంలో అగ్నిప్రమాదాలు ఎక్కడ జరిగిన ఆ దేశ ఆర్ధిక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.దేశ జనభా నానాటికి పెరుగుతుండటంతో అనేక రంగాల్లో పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాసంస్ధలు, ఫంక్షణ్ హాల్స్, ,భవన నిర్మణాలతో పాటు సిటీ నలుమూలల కర్మాగారాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.ఏదైనా అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది.ప్రమాదాల నివారణకు నేడు అప్రమత్తత చాల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంత అప్రమత్తత తీసుకున్న ప్రమాదాలకూ కొన్ని ప్రధాన కారణాలు తరుచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి.ప్రమాదాలు సంబవించకుండా ఎంత మంది ఎన్ఓసీ తీసు’కొని’ నిర్మాణాలు చేపడుతున్నారు? ఫైర్ స్టేషన్లలో ఉన్న సౌకర్యాల కొరత తీరేనా?పట్టణ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతులను సంక్రమంగా జారీ చేస్తున్నారా అనే అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవశ్యకత ఉంది.
(యాంసాని శివకుమార్-జనత న్యూస్)
కరీంనగర్ డివిజన్ పరధిలో గత సంత్సరం జనవరినుండి మొదలుకొని ఇప్పటి వరకు 322 అగ్నిప్రమాదాలు జరుగగా సుమారు రూ.2కోట్ల 91 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరీంనగర్ లోని ఆదర్శనగర్ ప్రాంతంలో 2024 ఫిబ్రవరి 20న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇక్కడున్న 30 గుడిసెల్లో 19 దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఉన్న 12 సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి.సమయానికి అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్ధలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.ప్రాణ నష్టం జరుగక పోయిన ఆస్ధి నష్టం జరిగింది.ఏప్రిల్ 14 నుంచి వారం రోజుల పాటు అగ్ని మాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జనత’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
- ఎండలు మండుతున్నాయి…
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువకు రావడం లేదు. దీంతో వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో ఆరేంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో సూర్యతాపంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవిలో ప్రతిరోజూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించడం సర్వసాధరణమైపోయింది . ఒకప్పుడు జనసంచారం తక్కువగా ఉన్నందున అగ్ని ప్రమాదం జరిగినా పెద్ద నష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో గ్యాప్ లేకుండా భవనాలు వెలిశాయి. దీంతో ఒక్కచోట అగ్ని ప్రమాదం జరిగితే ఆ ప్రాంతం మొత్తం అగ్గి బుగ్గయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో అగ్నిమాపక విభాగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కానీ ఫైర్ స్టేషన్లలో సిబ్బందిలో కొరత కారణంగా చాలా వరకు జరిగే అగ్నిప్రమాద సంఘటనల్లో నష్టాన్ని పూడ్చలేకపోతున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సంస్థలు, కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండడంతో పెద్ద ముప్పే జరగే అవకాశం ఉంది.
- 2023-24 లో అగ్ని గణాంకాల వివరాలు..
ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు తగ్గ సిబ్బంది కనిపించడం లేదు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 322 అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో 5 పెద్ద ప్రమాదాలు జరగగా 5 మధ్యరకం ప్రమాదాలు,290 చిన్నవి ప్రమాదాలు జరిగగా , రెస్క్ మరియు అత్యవసర ప్రమాదాల్లో భాగంగా 23 మందిని రక్షించినట్లు గణాంకలు చెబుతున్నాయి.
- అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యం..
1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో నౌకలో భారీగా మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదంలో 336 మంది ప్రయాణికులతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో దేశం మొత్తం అలర్టయింది. అప్పటి నుంచి అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో ప్రతీ ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వారం రోజులు పాటు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో సహా పాఠశాలలు, సంస్థలు, ప్రత్యేక కూడళ్లలో అగ్నిప్రమాదాల నివారణపై జాగ్రత్తలు వివరించనున్నారు.
- వేధిస్తున్న సిబ్బంధి కొరత..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 5, పెద్దపల్లిలో 3, జగిత్యాలో 3, సిరిసిల్లో 2 ఉన్నాయి.కరీంనగర్ లోని అగ్నిమాపక కేంద్రం (DFO) పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కో స్టేషన్ కు 16 మంది చొప్పున మొత్తం 13 స్టేషన్లలో 208 మంది సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బంది కొరత ఉంది. దీంతో కొన్ని ప్రమాదాలను నివారించలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇటీవల 67 మంది ఫైర్ మెన్స్ నియామకానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరు ప్రస్తుతం శిక్షణ తీసుకొని మూడు నెలల్లో విధుల్లోకి జాయిన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నరు. సిరిసిల్ల జిల్లాలో ఫైర్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, చొప్పదండి ఫైర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. జగిత్యాల, ధర్మపురిలోనూ నియామకం కావాల్సి ఉంది. కరీంనగర్ డీఎఫ్ వో పరిధిలో సిరిసిల్ల, సిద్ధిపేట ఫైర్ స్టేషన్లు ఆపరేషన్లో భాగంగా ఫైర్ కాలింగ్, బందోబస్తుకు సంబంధించి వ్యవహారాలు చూసుకుంటాయి.
- కరీంనగర్ లో ఎంత వరకు భద్రం?
కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిన తరువాత త్వరగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో భవనాలు, హాస్పటల్స్, విద్యాసంస్థలు కొకొల్లలుగా వెలుస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలు చేపట్టే ముందు ఎంత మంది అగ్ని మాపక కేంద్రం నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే సేప్టీ సర్టిఫికెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు.దీంతో కొందరు నిర్లక్ష్యంగా ఉండడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఎలాంటి పర్యవేక్షణ లేకుండానే అధికారులు ఎన్ఓసీలు జారిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.
అగ్నిమామాపక నివారణ వారోత్సవాల సందర్భంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. దీనిపై కలెక్టర్ పూర్తి స్ధాయిలో విచారణ జరిపిస్తే ఎన్నో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
- ప్రైవేట్ ఏజెన్సీల మాయాజాలం..
కరీంనగర్ డివిజన్ పరిధిలో మూడు నాలుగు ప్రైవేటు ఏజెన్సీలు కొంతమంది అగ్నిమాపక సిబ్బంది తో కుమ్మక్కై జిల్లాలోని పలు విద్యాసంస్థలకు,హాస్పిటల్స్ కు తదితర కార్యాలయాలకు ఎలాంటి నిబంధనలు పాటించకున్న నాసిరకం పరికరాలను అంటగడుతూ ఎన్ఓసీలు ఇప్పిస్తున్నట్లు తెలుస్తుంది,ఈ అక్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇదే విషయమై కరీంనగర్ డీఎఫ్ఓ వెంకన్నను వివరణ కోరగా ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులను నమ్మవద్దని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పర్యవేక్షణ చేసి అన్ని సక్రమంగా ఉంటే ఎన్ఓసీ జారీ చేస్తామన్నారు.ఇలాంటివి ఏదైనా తమ దృష్టికి తీసుకువస్తే అలాంటి వారి పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సౌకర్యాలు కల్పించాలి
-వెంకన్న,జిల్లా అగ్నిమాపక అధికారి,కరీంనగర్.
ఫైర్ స్టేసన్లలో ఉన్న సిబ్బంది కొతర తీర్చాలి. అలాగే నీటి సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది. ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగినప్పుడు నీటి కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం 4500 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ నీటి కొరత తీర్చడానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.కరీంనగర్ డివిజన్ పరిధిలోని కరీంనగర్,సిద్దిసేట,సిరిసిల్ల జిల్లాల్లో ప్రతి శుక్రవారం ఫైర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.2023 వ సంవత్సరంలో 564 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడ .అంతేకాకుండా రెస్క్య్ టీం ద్వారా వరంగల్ లో గత ఎడాది వందల మంది ప్రాణాలను ,కరీంనగర్ డివిజన్ పరిధిలో కూడ 23 మందిని కాపాడినాం.ఉన్న సిబ్బందితోనే అగ్ని ప్రమాదాల నివారణకు ఆ శాఖ అధికా రులు తంటాలు పడుతున్నారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడే ఎంతో ముఖ్యమైన అగ్నిమాపక శాఖలో ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.