Saturday, March 14, 2026

Cm Revanth Reddy: అడిషనల్ కలెక్టర్ ను అభినందించిన సీఎం రేవంత్

Cm Revanth Reddy: హైదరాబాద్, జనతా న్యూస్:రైతుల సమస్య పరిష్కరించినందుకు జనగామ అడిషినల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారు. అసలేం జరిగిందంటే? ధాన్యంలో తేమ, తాలు సాకుతో కనీస మద్ధతు ధర కంటే ట్రేడర్లు తక్కువ ధరకు కొనడంతో జనగామ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేశారు. ప్రభుత్వం ధర రూ. 2,203 కంటే తక్కువ ధర రూ. 1,500 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని అధికారులను నిలదీశారు. ఈ సంఘటన గురించి తెల్సుకున్న అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) రోహిత్‌ సింగ్‌ మార్కెట్‌ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడి ట్రేడర్లు ఇచ్చిన ధరల చిట్టీచూసి అవాక్కయ్యారు. దీంతో ట్రేడర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చెయ్యాలని ఆయన ఆదేశించారు.రైతుల సమస్య పట్ల పట్టనట్టు వ్యవహరించిన మార్కెట్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధరకే ధాన్యం కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్‌ ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్‌ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలిస్తే సహించేది లేదన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page