జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో విశ్వనాథ శర్మ సోమవారం అధికారులతో కలిసి చర్చించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది సహకారంతో జాతర విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు జెల్ల ప్రభాకర్, బర్ల రాజు, బోనగిరి ప్రభాకర్, బెజుగం విశ్వ ప్రసాద్, గుబురే సప్న,ఐలేని శ్రీనివాసరెడ్డి, ధోనే శ్యామ్ వివిధ అధికారులు పాల్గొన్నారు.
బెజ్జంకి: లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్ల పనులకు శ్రీకారం
- Advertisment -