Saturday, March 14, 2026

దాహం తీరుస్తున్న ‘కోట’ చలివేంద్రాలు..

కరీంనగర్‌, జనతా న్యూస్‌: లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో సోమవారం లయన్‌ కోట సతీష్‌ కుమార్‌ తన తాత కోట మల్లయ్య జ్ఞాపకార్థం గొల్లపల్లి బస్టాండ్‌, ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్‌ లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకసారి మజ్జిగ, ప్రతిరోజు చల్లని నీళ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడిరచారు. తీవ్రమైన ఎండలతో దాహార్తితో అల్లాడిపోతున్న జనాలకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్‌ పయ్యావుల రామచంద్రం అన్నారు.

kota cahlivendram
kota cahlivendram

ఈ చలివేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.అనేక దేవాలయాలలో జరిగే ఉత్సవాలలో అన్న వితరణ కార్యక్రమాలు కోట సతీష్‌ నిర్వహిస్తారని ప్రశంసించారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందించే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు వారికి కలుగాలని వారు కోరారు. కోట సతీష్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఎల్లారెడ్డిపేట ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకుకృతజ్ఞతలు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయిని భాస్కర్‌ రెడ్డి, ట్రెజరర్‌ రావుల మల్లారెడ్డి, డిస్టిక్‌ క్యాబినెట్‌ మెంబర్స్‌ ముత్యాల శ్రీనివాస్‌ రెడ్డి, నంది కిషన్‌, ఇతర లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు పెంజర్ల రవి, పార్టీ దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, చేపూరి రాజేశం, తదితరులు పాల్గొన్నారు. కోట సతీష్‌ సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page