Saturday, March 14, 2026

9న హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, బూరెల వితరణ

కరీంనగర్, జనతా న్యూస్: ఉగాది పర్వదినం సందర్భంగా ఈనెల 9న హిందూవాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ఉంటుందని ప్రముఖ న్యాయవాది, హిందూ వాహిని జిల్లా సంయోజక్ సామాజికవేత్త బెజ్జంకి శ్రీకాంత్ తెలిపారు. తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏడాది ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడి, బూరెల వితరణ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా హిందూవాహిని కరినగర్ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న మంగళవారం రోజు ఉదయం 9.30 గంటల నుంచి టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉగాది పచ్చడి, బూరెల వితరణ కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హిందూ వాహిని బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్ గారు పాల్గొంటారని తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page