ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ఇతర బాలీవుడ్ నటులు కనిపించనున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అటు పద్మావతి పాత్రలో దీపికా పదుకొనే, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఈ సమయంలో ఎన్నికల కారణంగా వాయిదా అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్లో కల్కి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కానీ చిత్రం యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సమాచారం బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశ చెందుతున్నారు.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ..
- Advertisment -