హైదరాబాద్, జనతాన్యూస్: సంగారెడ్డి జిల్లాలోని ఆర్గానిక్ పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. ఆయిల్ బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ తో సహా నలుగురు కార్మికులు ఇప్పటికే మరణించిన విషయం తెలిసిందే. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయ సిబ్బంది కనుగొన్నారు. ఈయనది హత్నూరు మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేష్ గా గుర్తించారు.
ఇదిలా ఉండగా మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు వచ్చి ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ముందుగా బాయిలన్ నుంచి పొగ రావడంతో దానిని పరిశీలించేందుకు వెళ్లిన పరిశ్రమ డైరెక్టర్ రవి శర్మ, తమిళనాడుకు చెందిన దయానంద్, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, మధ్యప్రదేశ్ కు చెందిన సురేష్ పాల్ స్పాట్ లోనే మరణింనట్లు జిల్లా కలెక్టర్ మల్లూరు క్రాంతి అధికారిగాంగా ప్రకటించారు. చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి విష్ణు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తాజాగా రమేష్ మృతితో మొత్తం మరణించిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది.