రాష్ట్ర మాల సంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య.
జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాన్ని మాల మహానాడు నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, రాష్ట్ర మాల సంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య పాల్గొని మాట్లాడారు. భారత ప్రజలకు రక్షణ కవచమైన రాజ్యాంగాన్ని ఎంతో శ్రమకోర్చి అంబేద్కర్ రచిస్తే నేటి కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు ధ్వంసం అవుతున్నాయని, మనువాద ముసుగులో దళితులపై దాడులు అనేకం జరుగుతున్నాయని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లను గెలుచుకొని రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అంబేద్కర్ మనకు అందించిన స్వేచ్ఛాయుతమైన పేదలకు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు స్త్రీలకు రక్షణ కవచమైన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మనందరి పైన ఉందని సూచించారు. అందుకు తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 5న జరిగే రాజ్యాంగ రక్షణ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాలుపంచుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియన్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలా శేఖర్ బాబు, మండల అధ్యక్షులు దీటి బాల నర్సు, ఎల రాజు,దామేర మల్లయ్య, మీసాల ప్రవీణ్, మీసాల శంకర్, పబ్బతి శ్రీనివాస్, బోలుమల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.