హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహార హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఇందులో ముందుగా అరెస్టు అయిన ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు బుధవారం విచారించింది. ఈ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కౌంటర్ పై ఏప్రిల్ 8న వాదనలు వింటామని తదుపరి విచారణ వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పి వేణుగోపాలరావును పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డీసీపీ విజయ్ కుమార్, ఏసిపి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. వేణుగోపాలరావు విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ
- Advertisment -