బీజెపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ
జనతన్యూస్ బెజ్జంకి : బీజేపీ రాష్ట్ర పార్టీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచనల మేరకు సోమవారం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు అధ్యక్షతన మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బెజ్జంకి తహసిల్దారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యదర్శి మరియు మానకొండూరు నియోజకవర్గం ప్రబారి బొమ్మ జయశ్రీ మాట్లాడుతూ రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. మండలంలో కొన్నిచోట్ల సరైన సమయంలో సాగునీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఆవేదన చెందారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన పంటకు ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని, పెట్టుబడి ఖర్చులే ఎకరాకు 20 నుంచి 30 వేల వరకు ఖర్చు అవుతుందని పదివేల నష్టపరిహారం ఏ మేరకు రైతుల నష్టాన్ని భర్తీ చేస్తుందని ఆమె ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల పంట నష్టపరిహారం అందించాలని, పండించిన పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సంఘ రవి, బండిపెల్లి సత్యనారాయణ, కొత్తపేట రామచంద్రం, తూముల రమేష్, బొప్పారా అజయ్, వడ్లూరు శ్రీనివాస్ గంప రవికుమార్, శీలం వెంకటేశం, వేముల శంకర్, బండిపెల్లి నరేష్, బోనగం నరేష్ గౌడ్, ఎల్లం, పులి శ్రీకాంత్ గౌడ్, జెల్ల అనిల్, బీర మహేందర్ రెడ్డి, అనిల్, గాజ రవి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.