Bharata Ratna:భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆయన కుమారుడు ప్రభాకర్ రావు శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. దివంగత ప్రధాని పలు రంగాల్లో అసాధారణ సేవలు అందించినందుకు ఈ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మూడు విడతల్లో ఐదుగురు ప్రముఖులకు భారతరత్నను ప్రకటించింది. వీరిలో బీహార్ మాజీ సీఎం కార్పూర్ ఠాకూర్, బిజెపి అగ్ర నేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఉన్నారు. ఒకే సంవత్సరంలో ఎక్కువ మందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇందులో నలుగురికి మరణాంతరం అవార్డు లభించగా నేడు వారి కుటుంబ సభ్యులు పురస్కారాన్ని అందుకున్నారు.
Bharata Ratna: పీవీకి భారతరత్న అవాార్డు.. కుమారుడికి ప్రదానం
- Advertisment -
