టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్
కరీంనగర్,జనాతా న్యూస్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో డిప్లామా మొదటి సంవత్సరం క్యాంపు హాస్టల్ లో ఉంటు చదువుకుంటున్న అభిలాష్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిజిపిఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జ్యోతిష్మతి కళాశాలలో డిప్లోమా మొదటి సంవత్సరం క్యాంపు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, దామరకుంట గ్రామానికి చెందిన ఎనగంటి రజిత శ్రీనివాస్ ల మొదటి కుమారుడు అభిలాష్ , తను ఈ నెల 01న బయటకు వెళ్ళినాడని తన తండ్రి ఫోన్ చేస్తే కళాశాలలో లేడని యాజమాన్యం తెలుపడంతో తండ్రి శ్రీనివాస్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి తన కుమారుని ఆచూకి కోసం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినప్పటికి కనీసం దర్యాప్తు చేయకపోవడం, ఒక పత్రికా ప్రకటన చేయక పోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సుమారు 25 రోజులు యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వలన విద్యార్థి ఈ నెల 27 న తిమ్మపూర్ గ్రామంలోని చైతన్య కాలేజి వెనుకాల వున్న వ్యవసాయ బావిలో తల లేని మొండెం దొరకడం అభిలాష్ గా గుర్తించడం వెనుకాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
కళాశాల యాజమాన్యంతో పాటు మరణానికి కారకులైన వారిని గుర్తించి చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభు డిమాండ్ చేశారు. మృతుడు అభిలాష్ కుటుంబానికి కళాశాల యాజమాన్యం 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరిని ఏకం చేసి కళాశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అభిలాష్
తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి బరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ర్ట నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ దార మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ సంగుపట్ల మల్లేష్, టి జి పి ఏ నాయకులు కొమురయ్య, పేరెంట్స్ జిల్లెల్ల శంకర్, సిరిసిల్ల అంజయ్య, అనిల్ లు పాల్గొన్నారు.
