తిమ్మాపూర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు తెల్లవారుజామునుండే రథం పై ఉన్న స్వామి వారినీ దర్శించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, డైరెక్టర్లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకొని, కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ధర్మం పేరుతో ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఉడుతల వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్,కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ ,మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి,నాయకులు మార్క నర్సయ్య, చిట్టిబాబు,జినుక మారుతి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
- Advertisment -
