కరీంనగర్, జనతా న్యూస్: రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీఐఎస్ఎఫ్ బలగాలతో బుధవారం టూ టౌన్ పోలీసు స్టేషన్ ల పరిధిలో పలు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ కరీంనగర్ గీతాభవన్ తెలంగాణ చౌక్ వద్ద ప్రారంభమై అతిధిగృహం మీదుగా, కోర్టు చౌరస్తా నుండి మంచిర్యాల చౌరస్తా వద్ద ముగిసింది. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీ.ఐ.ఎస్.ఎఫ్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ , కంపెనీ కమాండంట్ విక్రాంత్, అసిస్టెంట్ కమాండంట్ విజేందర్, ఇన్స్పెక్టర్ లు విజయ్ కుమార్ (టూ టౌన్) ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్: సీఐఎస్ఎఫ్ బలగాల ప్లాగ్ మార్చ్
- Advertisment -
