హైదరాబాద్, జనతా న్యూస్: హైదరాబాద్లోని బండ్లగూడ సీఐ మహమ్మద్ షాకిర్ అలీ, ఎస్సై వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. ఓ మహిళ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించినందుకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణ జరిపిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర జారీ చేశారు.
ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్
- Advertisment -