ఛత్తీస్ గఢ్ లో బుధవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో చికుర్ బత్తి, పత్తి పుష్పాక అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్జపులు రిగాయి ఘటనలో ఆరుగురు మావోయిస్టు హ్రతమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగపడ్డారని, దీంతో రక్షణ కోసం భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అధికారులు పేర్కొన్నారు. కాగా మావోయిస్టుల మృతదేహాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో మహిళా మృతదేహం ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టుల డంప్ లో భారీగా ఆయుధ సామగ్రిని గుర్తించామని అధికారులు తెలిపారు.
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి
- Advertisment -