హైదరాబాద్, జనతా న్యూస్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు తనకు ఎవరో తెలియదని తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం పోరాడిన తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మచ్చ ఎప్పుడు రాలేదన్నారు. కొందరు కావాలని తనను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని, తనని ఇబ్బంది పెట్టాలని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని అన్నారు. భూ దందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ ఆయనను తొలగించిందని, నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారన్నారు. అతడి పై ఎన్నో కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దని ఎర్రబెల్లి అన్నారు.
నాపై తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు..: ఎర్రబెల్లి దయాకర్ రావు
- Advertisment -
