Thursday, July 3, 2025

వైభవంగా తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తుంబుర తీర్థ ముక్కోటి వేడుక అంగరంగ వైభవంగా సాగింది. 2024 మార్చి 24, 25 రెండు రోజులపాటు ఈ ఉత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 24 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుమలలోని తూర్పు కనుమల్లో అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవిలో కొలువైన తీర్థాల్లో తుంబురతీర్థం ఒకటి. దీనికి ఎంతో విశిష్టత ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలో తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందించారు. ప్రాథమిక చికిత్స  కేంద్రాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page