చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించినందుకు తమిళనాడులోని డీఎంకే పార్టీకి చెందిన మంత్రి అనితా రాధాకృష్ణన్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 22న ట్యూటీ కోరిన్ జిల్లాలోని తొండపట్టులో నిర్వహించిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ మోదీపై దుర్భషలాడారు. దీంతో బీజేపీ తుత్తూకూడి సౌత్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సి రంగతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఒక బహిరంగ సభలో అది కూడా ఒక మహిళ ఎంపీ కనిమొళి సమక్షంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాధాకృష్ణన్ అసభ్యకరమైన భాషలో మాట్లాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
