వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రధానమంత్రి పై పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అని తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి అభ్యర్థిపై ఇన్నిరోజులు ఉన్న ఉత్కంఠకు తాజా జాబితాతో తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ శనివారం నాలుగో జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధానిపై పొటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన అజయ్ రాయ్ ని మోడీపై పోటీ చేయమని బరిలో దింపింది. అయితే ఇదే రాష్ట్రంలోని 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కాగా నాలుగో జాబితాలో మొత్తం 185 మంది అభ్యర్థులను ప్రకటించారు.
ప్రధాని మోదీపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
- Advertisment -