తిమ్మాపూర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో రూ. 52209 రికవరీ చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి (ఢీఆర్డీవో) శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో 2022-2023 సంవత్సరానికి గాను మండలంలోని 23 గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులపై 13వ విడత సామాజిక తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని అన్నీ గ్రామాల్లో రూ.3.26కోట్ల పనులు చేయగా, గ్రామాల వారిగా పనులపై చేసిన తనిఖీ నివేదికలను డీఆర్పీలు వినిపించగా, ఒక్కో అంశంపై డీఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని గ్రామాల్లో జరిగిన క్రీడా ప్రాంగాణాలలో రూ.44,376 ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించి, తరువాత చెల్లింపుల్లో వీటిని ఆపాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శుల నుండి రూ.7833/-లు రికవరీకి డీఆర్డీవో ఆదేశించారు.
క్రీడా ప్రాంగణంలో వేసిన రేకుల మందంలో తేడాలున్నట్లు గుర్తించారు. పని చేసిన కూలీకి వేతనం అందాలని, పొరపాట్లు జరిగిన చోట గ్రామ పంచాయతీ నుండి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కూలీలకు డబ్బులు చెల్లింపులో అధికారుల సంతకాలు లేకుండానే చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. పనులు జరుగుతున్నపుడు వసతులు కల్పించాలని సూచించారు. వారం రోజుల్లోగా జాబ్ కార్డులు, రిజిష్టర్లు అప్ డేట్ చేయాలని ఆదేశించారు. పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సామాజిక తనిఖీలో డీఆర్డీవోతోపాటు అడిషనల్ పీడీ సంధ్యారాణి, ఎంపీడీవో విజయ్ కుమార్, ఏవివో వెంకటేశ్వర్ రెడ్డి, అంబడ్స్మన్ లక్ష్మి నారాయణ, అసిస్టెంట్ ఏవివో కళావతి,, ఎంపీవో కిరణ్, ఎస్ఆర్పీ బెజ్జంకి తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులు, పాల్గొన్నారు.
