Aravind Kezriwal: న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై మరో కేసు నమోదయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చెందిన డైరెక్టర్ పై ఇంటలిజెంట్ అధికారులతో నిఘాపెట్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు గురువారం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సందర్భంగా ఈడీ అధికారులు 150 పేజీలతో కూడిన డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చెందిన ఇద్దరు ఆఫీసర్ల పేర్లు కూడా ఉన్నాయట. వీరికి సంబంధించిన అత్యంత సీక్రెట్ విషయాలు సైతం డాక్యుమెంట్లో బయటపడడం చూసి ఈడీ అధికారులు షాక్ అయ్యారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా వారికి సెక్యూరిటీని కూడా పెంచి, తదుపరి విచారణ కోసం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ పై మరో కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Aravind Kezriwal: కేజ్రీవాల్ పై మరో కేసు?
- Advertisment -