రాయికల్, జనతా న్యూస్: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్ ఆచార్యులు, వేద పండితులు లక్ష్మీణా చార్యుల వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం జరిపించారు.
కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కొమ్ముల రాధా ఆది రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహిపతిరెడ్డి, మాజీ సర్పంచులు సామల లావణ్య వేణు, నారాయణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్ కనపర్తి శ్రీనివాస్, గ్రామ సేవా సమితి అధ్యక్షులు కంటే విష్ణు, నాయకులు సురకంటి చినరాజురెడ్డి, బద్దం సుజాత, మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.