- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని, జనతా న్యూస్: మంథని పట్టణ ప్రజలకు ఆదర్శవంతమైన, నీతిమంతమైన పరిపాలన అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని మున్సిపల్ అవిశ్వాస పర్వాన్ని విజయ వంతం చేసి, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఎన్నికైన చైర్మన్ పెండ్రు రమాదేవి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ల ను,సహకరించిన ఉప్పట్ల శ్రీనివాస్ ఇనుముల సతీష్ ఇతర నాయకులను రాష్ట్ర మంత్రి అభినందించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ను పెంచే విధంగా కొత్త పాలక వర్గ పరిపాలన ఉండాలని అన్నారు. పాలక వర్గం సహకారంతో రాబోయే రోజుల్లో మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని,మొన్నటి పార్లమెంట్ ఎన్నికల కోడ్ కు ఒకటి రెండు రోజుల ముందే మంథని పట్టణ అభివృద్ధి కోసం 22 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని అన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పనులను యుద్ద ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధంగా చైర్మన్,వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోపెద్దపల్లి మాజీ ఎం.పి. చెలిమల సుగుణ కుమారి ,మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి,వైస్ చైర్మన్ సీపతి బానయ్య, కౌన్సిలర్స్ వేముల లక్ష్మి, కొట్టే పద్మ,నక్క నాగేంద్ర వి.కె.రవి, చొప్పకట్ల హనుమంతు,కుర్ర లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనుముల సతీష్ , ఉప్పట్ల శ్రీనివాస్,గుండా పాపారావు, వేముల సమ్మయ్య,కొట్టే రమేష్,నక్క శంకర్, ముస్కుల లోకెంధర్ రెడ్డి,సంతోష్ రెడ్డి, లోకే రాము,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.