తిమ్మాపూర్, జనతా న్యూస్: అధికారులంతా సమష్టిగా పనిచేసి ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పోలీసులకు సూచించారు. బుధవారం సీపీ మొహంతి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ని పెండింగ్ కేసుల వివరాలను సీఐ స్వామి, ఎస్సై చేరాలు ను అడిగి తెలుసుకుని, త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులంతా నిజాయితీగా , నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా సందర్శించి ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వెంటనే పై అధికారులకు తెలపాలన్నారు.
రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్లతో పాటుగా గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవల ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బైండోవర్ కాబడి గడువు ముగిసిన వారిని తిరిగి బైండ్ ఓవర్ చేయాలన్నారు.పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.
స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.