తిమ్మాపూర్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ (8వ డివిజన్) లో మంగళవారం పొరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 66వ అర్థ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా అర్ధ-వార్షిక నివేదికను సొసైటీ కార్యనిర్వహణ అధికారి కళ్లెం చొక్కారెడ్డి
చదివి వినిపించారు. సొసైటీ ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లు, రైస్ రైస్ మిల్లులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నూతన గిడ్డంగులు, భవన,ఇతర నిర్మాణాలు, రుణాలు, డిపాజిట్లు, ఆదాయ, వ్యయాలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.
దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి మాట్లాడుతూ…సొసైటీ అభివృద్ధి పనులకు అయిన ఖర్చు వివరాలు, రుణాలు, ఆదాయ, వ్యయాల పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణలతో కూడిన సమాధానాలు ఇచ్చారు. అనంతరం సొసైటీ, సభ్యులు, రైతుల శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని సర్వ సభ్యుల ఆమోదం మేరకు పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో చైర్మెన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సల్ల శారద- రవీందర్, మాజీ చైర్మన్లు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఎస్.ఎల్ గౌడ్, ముస్కు మోహన్ రెడ్డి, సహకార సంఘాల యూనియన్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ హైమద్ అలీ, డైరెక్టర్లు రెడ్డి అంజిరెడ్డి, జాప మునీశ్వరి, బిజిలి ఎల్లయ్య, గోపు మల్లారెడ్డి, ఆశోద కుమార్ స్వామి, నాంపల్లి ఆంజనేయులు, సూదగోని ఆంజనేయులు గౌడ్, బూడిద మధునమ్మ, గంకిడి చిన్నసత్యనారాయణ రెడ్డి, నిర్వాహణాధికారి కళ్లెం చొక్కా రెడ్డి, కంది అశోక్ రెడ్డి లతో పాటు ప్రజాప్రతినిధులు, సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.