లోక్ సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పోలీసలు విస్తృత తనిఖీలు ఉంటాయని, అందువల్ల ప్రజలు కొన్ని నిబంధనలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ మొహంతి తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలకు సంబందించిన వివరాలు వెల్లడించారు.
- ఎన్నికల సంబంధిత సభలు, సమావేశాల నిర్వహించుకొనుటకు ముందస్తుగా ఈ-సువిధ అప్లికేషన్ నందు దరఖాస్తు చేసుకోని తప్పనిసరిగా అనుమతి పొందవలెను. ఎటువంటి సభలలోలేదా సమావేశములలోనైనా వ్యక్తిగత దూషణలు చేసుకోరాదు. ఏదైనా రాజకీయ పార్టీలకు సంబందించిన వ్యక్తులు సభలను నిర్వహించే సమయములో ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొనరాదు,గొడవలు సృష్టించరాదు. అనుమతిలేని సభలు, సమావేశాలు , ర్యాలీ లు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
- DJ సౌండ్ సిస్టమ్ ను ఎవరు వినియోగించరాదు.కాదని వినియోగించిన వారిపై , ఆర్గనైజర్ , ప్రొవైడర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును. లౌడ్ స్పీకర్ వినియోగం కొరకు ముందస్తుగా సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలి. ఉదయం 06.00 గం.లకు ముందు, రాత్రి 10.గం. ల తరువాత అనుమతి పొందినా లౌడ్ స్పీకర్ కూడా వినియోగించరాదు.
- దేవాలయాలు, మసీదులు , చర్చ్ లేదా మరియు ఇతర ప్రార్ధన స్థలాలను ఎన్నికల ప్రచారనిమిత్తం వినియోగించరాదు.
- ఎన్నికల ప్రచార నిమిత్తం వాడే వాహనాలు యొక్క అనుమతి పత్రంను సదరు వాహనమునకు తప్పనిసరిగా బయటకు కనిపించే విధంగా అతికించవలెను.
- సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చ గొట్టే వ్యాఖ్యలు , వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును, చట్ట వ్యతిరేక పనులు చేస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పైన చట్ట రీత్యా కఠిన మైన చర్యలు తీసుకొనబడును.
- ఓటర్లను ప్రలోభ పెట్టే వాగ్దానాలు చేయకూడదు. అక్రమ మద్యం రవాణా , డబ్బు పంపిణీ , ఉచితంగా వస్తువుల పంపిణీ నిషేధం , ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.
- ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించబడిన వ్యక్తులను వినియోగించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా వెలువడిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి ) నిస్పక్షపాతంగ , పారదర్శకంగా , ఎంతో పకడ్బందీగా అమలు చేయుటకు అవసరమైన అన్ని చర్యలు పోలీస్ శాఖ తరుపున తీసుకుంటామని , ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులందరికీ అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ కోరారు.