Saturday, July 5, 2025

22 నుంచి సహస్ర గాయత్రి మాత యజ్ఞం

కరీంనగర్, జనతా న్యూస్: భారతావనిలో జగన్మాతగా అవతరించిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ  మహా యోగిని మాణీకేశ్వరీ మాత ఓంకార ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో గాయత్రి మాత యజ్ఞ మహాకార్యాన్ని కరీంనగర్ లోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్ననిర్వహించనున్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 22న ఉదయం 5 గంటలకు అమ్మవారి నాగసింహాసన అభిషేకం, అమ్మవారి పాదపూజ, ధ్వజారోహణ, పుణ్యహవచనము, 9 గంటలకు సహస్ర గాయత్రీ మాత యజ్ఞం, మధ్యాహ్నం 12.30 గంటలకు మంగళహారతి నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భజన కార్యక్రమం ఉంటుందన్నారు. 23న యధావిధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 24న యధావిధిగా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు అమ్మవారి నగర సంకీర్తన నిర్వహించనున్నారు. ప్రతీరోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఓంకార ఆశ్రమ కమిటీతో పాటు మాతృశ్రీ బుక్ సెల్లర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పూర్తి వివరాలకు 628174 8801, 6300873122, 9441251580 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page