హైదరాబాద్, జనతా న్యూస్: గత వారం వరకు భారీగా పెరిగిన చికెన్ ధరలు ఇప్పుడు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ. 200 నుంచి రూ.210 వరకు విక్రయిస్తున్నారు. ఇదే వారం కిందట రూ. 280 నుంచి రూ. 300 వరకు ధర పలికింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రత పెరగడంతో కోళ్ల లభ్యత తగ్గిందని అప్పుడు చికెన్ ధరలు పెరిగాయని మాంసం వ్యాపారులు అంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడడంతో చికెన్ ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ముందు ముందు వేసవి కాలం ఉండడంతో మరోసారి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఆదివారం చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈ సందర్బంగా సండే రోజు చికెన్ ధరలు తగ్గాయని తెలియడంతో చాలా మంది చికెన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.
భారీగా తగ్గిన చికెన్ ధలు.. కిలో ఎంతంటే?
- Advertisment -