కరీంనగర్, జనతా న్యూస్: నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడమే గాక, బాధితుని భూఆక్రమణకు పాల్పడ్డ కొత్తపల్లి, గజ్వేల్ లల్లో తహసీల్దార్ గా పనిచేసిన చిల్లా శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం సేకరించేందుకు కోర్టు ద్వారా 48 గంటలుపోలీసు కస్టడీకి తీసుకున్నామని కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. కస్టడీలోకి తీసుకున్న చిల్లా శ్రీనివాస్ నుండి మరింత విలువైన సమాచారం సేకరించేందుకుగాను అతని ఇల్లు మరియు గెస్ట్ హౌస్ లల్లో సోదాలు నిర్వహించిన రూరల్ పోలీసులు పలు కీలక డాకుమెంట్లను స్వాధీన పరుచుకున్నారని తెలిపారు.
రూరల్ పోలీసుల కస్టడీలో తహసీల్దార్
- Advertisment -