కరీంనగర్, జనతా న్యూస్: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రానున్న నేపథ్యంలో కరీంనగర్ లో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రతిమ మల్టీఫ్లెక్స్ లో అర్ధరాత్రి చేసిన సోదాల్లో రూ.6.65 కోట్లు పట్టుకున్న ఏసీపీ నరేందర్ తెలిపారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేశామని, వీటిని కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన శనివారం మధ్యాహ్నం వెలువడనుంది. ఈ సందర్భంగా భారీగా నగదు లభ్యం కావడం రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది.
కరీంనగర్: భారీగా నగదు పట్టివేత
- Advertisment -