హైదరాబాద్, జనతా న్యూస్: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన రెండు స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆ స్థానాలకు బీఆర్ఎస్ అధికారులు సహకరించాలనీ పార్టీ అధినేత సూచించారు. బీఆర్ఎస్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు.
for Epaper click here
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
మరో నాలుగు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. కాగా నాగర్ కర్నూలు, హైదరాబాద్ సీట్లను బీఎస్పీకి కేటాయించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో 17 నుంచి రెండుపార్టీలు కలిసి ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది.