కోల్ కతా: తృణముల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి గాయం కావడం కలకలం రేపింది. నిన్న ఒక్కసారిగా ఆమెకు తలక గాయమై రక్తం కారుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స కోసం ఎస్ ఎస్ కే యం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతర శుక్రవారం వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మణిమోయ్ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ నుదుటి మీద గాయంతో ముఖ్యమంత్రి ఆసుపత్రికి వచ్చారని అన్నారు. అయితే ఈ గాయం ఎవరో వెనుక నుంచి తోసివేసిన కారణంగానే అయిందని అన్నారు. ప్రస్తుతం మమత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మమత ఇంట్లో కిందపడ్డారని పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కానీ మమతకు వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను వెనుక నుంచి ఎవరో తోసేశారని చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. కాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి దీదీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.
దీదీ గాయానికి కారణం ఇదే.. వైద్యుల ప్రకటన
- Advertisment -